వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు | Allagadda tdp leader Irigela Rampulla Reddy met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు

Published Sat, Feb 16 2019 1:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆళ్లగడ్డ టీడీపీ నేతలు కలిశారు. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో శనివారం ఉదయం టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్‌ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి గతంలో ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అయితే టీడీపీలో తమకు సరైన గౌరవం లేదని, కష్టకాలంలో అండగా నిలిచిన తమకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఇరిగెల సోదరులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాస్‌, దాసరి జై రమేష్‌ తదితరులు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ...ప‍్రతిపక్ష నేతతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement