
కర్నూలు, ఆళ్లగడ్డ రూరల్: అళ్లగడ్డ మండలంలోని అహోబిలం సమీపంలో తెలుగుగంగ కాలువ వద్ద భర్త.. భార్యను చంపిన ఘటన సోమ వారం చోటుచేసుకుంది. రుద్రవరం మండలం డి.కొట్టాల గ్రామానికి చెందిన నరేష్ కుమార్‌రెడ్డి..
భార్య దమయంతిని(30) అహోబిలం వెళ్లే దారిలో తెలుగుగంగ కాలువ వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనతంరం పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే డీఎస్పీ కులశేఖర్, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. నరేష్‌కుమార్‌రెడ్డి, దమయంతి ఏడాది క్రితం విడాకులకు దరఖ>స్తు చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ సోమవారం అతనితో ద్విచక్రవాహనంపై వెళ్లి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.