
సాక్షి, అమరావతి: పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రిగా ఆర్‌కే రోజా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లె క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబసమేతంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు అందుకున్నారు.
మంత్రి మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. అన్న ఆశీస్సులే అండగా టూరిజం డెవలప్‌మెంట్‌కు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రోజా భర్త ఆర్‌కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్ ఉన్నారు.
చదవండి: (టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా)