ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు.
అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN
— ANI (@ANI) January 28, 2022
Comments
Please login to add a commentAdd a comment