bridge inaguration
-
వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN — ANI (@ANI) January 28, 2022 చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
‘అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి?’
బెంగళూరు: అస్సాంలోని డిబ్రూగఢ్ సమీపంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద రోడ్డు కమ్ రైలు వంతెన(బోగీబీల్) ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బోగీబీల్ వంతెనకు 1997లో ప్రధాని హోదాలో తానే శంకుస్థాపన చేశానని పేర్కొన్నారు. అలాంటింది ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధకరమన్నారు. తన పాలన కాలంలో కశ్మీర్ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్, బోగీబీల్ వంతెన పథకాలను మంజూరు చేశానని.. అలాగే ప్రతి ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. కానీ నేడు ప్రజలు ఆ విషయన్ని మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతం మరిచి ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీకు ఆహ్వానం అందలేదా అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి? అని చమత్కారంగా సమాధానమిచ్చారు. కాగా, బోగీబీల్ వంతెనను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1997 లోనే ఆమోదం.. బోగీబీల్ వంతెనను అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించారు. ఈ ఒప్పందంలో భాగంగా 1997లోనే ఈ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న నాటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ బోగీబీల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది. -
‘బీజేపీ అధ్యక్షుడిని నెట్టివేయలేదు’
న్యూఢిల్లీ: యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆప్‌ల నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన తనను అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని పార్లమెంట్ సభ్యుడు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు. తివారీ వ్యాఖ్యలపై స్పందిచిన ఖాన్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తివారీ స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు తెలిపారు. అంతేకానీ అతన్ని నెట్టివేయలేదని వెల్లడించారు. ఒకవేళ తివారీ స్టేజ్‌పైకి వెళితే.. అతను సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలతో అమర్యాదగా ప్రవర్తించేవారని.. అతని చర్యలు అనుమానించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తివారీని ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. కానీ సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆయన తన అనుచరులతో వచ్చారని అన్నారు. అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తివారీ స్టేజ్‌కు సమీపంలోకి వచ్చినా పోలీసులు అతన్ని అడ్డుకోలేదని ఖాన్ అన్నారు. అంతకుముందు ఈ ఘర్షణపై తివారీ స్పందిస్తూ.. సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని ఆరోపించారు. ఇదంతా సీఎం కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందని అన్నారు. ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇది తన నియోజకవర్గంలో(ఈశాన్య ఢిల్లీ) జరగుతున్న కార్యక్రమం అని.. చాలా కాలంగా ఆగిపోయిన బ్రిడ్జి పనులను తానే తిరిగి ప్రారంభించానని అన్నారు. ఈ వివాదంపై కేజ్రీవాల్ ట్విటర్లో ఘాటుగా స్పందించారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు. ఇక్కడ ఘర్షణ జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులను పర్యవేక్షించే లెఫ్టినెంట్ గవర్నర్‌పై శాంతి, భద్రతలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. -
ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్న యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను అనుమతిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుందని చెప్పారు. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడటం ఒక ప్రత్యేకత కానుందని చెప్పారు. మొత్తం 50 మందిని తీసుకెళ్లే సామర్థ్యమున్న గాజు ఎలివేటర్లు నాలుగింటిని వచ్చే రెండు నెలల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు, ఎత్తు 165 మీటర్లు కాగా వెడల్పు 35 మీటర్లు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం రూ.464 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 2004లో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2010లో కామన్వెల్త్ గేమ్స్ నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు సవరించిన అంచనా రూ.1,131 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2011 నుంచి వంతెన నిర్మాణంలో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. 2015 నాటికి వంతెన నిర్మాణ అంచనా వ్యయం రూ.1,594 కోట్లకు పెరిగిపోయింది. 2018 నవంబర్ 4వ తేదీకి ఎట్టకేలకు ‘సిగ్నేచర్’ కల నిజమయింది. -
ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 14 ఏళ్ల కిత్రం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. యమునా నదిపై నిర్మితమైన ఈ ఐకానిక్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించనున్నారు. నవంబరు 5 నుంచి ఈ బ్రిడ్జి ప్రజా వినియోగంలోకి రానుంది. 575 మీటర్ల పొడవు, 35.2 మీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల వజీరాబాద్ బ్రిడ్జిపై ట్రాఫిక్ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది. కాగా 2004 నుంచి వివిధ కారణాల వల్ల పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 1575 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సిటీ అందాలు వీక్షించేందుకు వీలుగా భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జిగా ఢిల్లీ బ్రిడ్జి గుర్తింపు పొందింది. ఈ బ్రిడ్జిపై నిర్మించిన 150 మీటర్ల ఎత్తైన గ్లాస్ బాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెల్ఫీ స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్న ఈ గ్లాస్ బాక్స్‌లో నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 50 మందిని మోసుకు వెళ్ల గల గ్లాస్ బాక్స్ గుండా యమునా నది అందాలతో పాటు, సిటీ మొత్తాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ సెల్ఫీ స్పాట్ ఫిబ్రవరి నుంచి వినియోగంలోకి రానుంది. -
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం- జక్కిపల్లి గ్రామాల మధ్య సాగర్ ఎడమ కాలువ పై రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జీని మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం మోటపల్లిలో 3500 ఎకరాలు సాగుబడి అయ్యే అయితు ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు ఉన్నారు.