Connecting Bridge
-
వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN — ANI (@ANI) January 28, 2022 చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
షాపింగ్ మాల్‌లోకి మెట్రో రైలు కనెక్టింగ్ బ్రిడ్జి
సాక్షి, బెంగళూరు : బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న మంత్రి షాపింగ్ మాల్‌లోకి దేశంలోనే తొలిసారిగా మెట్రో రైలు కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏర్పాటైంది. సంపిగె రోడ్డులోని మెట్రో స్టేషన్లో దిగగానే నేరుగా మంత్రి షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించే విధంగా బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్‌ని మంత్రి డెవలపర్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుశీల్ మంత్రి, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ కట్టె సత్యనారాయణ, బీఎంఆర్సీఎల్ ఎం.డి ప్రదీప్ సింగ్ కరోలా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ... పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్‌ని నిర్మించినట్లు చెప్పారు. బీఎంఆర్సీఎల్ యంత్రాంగం కనెక్టింగ్ బ్రిడ్జ్ డిజైనింగ్‌ని రూపొందించగా, మంత్రి డెవలపర్స్ యాజమాన్యం ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చిందన్నారు. మెట్రో రైలు రెండో దశలో సైతం ఈ తరహా ప్రాజెక్టులను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం సుశీల్ మంత్రి మాట్లాడుతూ... మోడ్రన్ బెంగళూరును నిర్మించడంలో ఇది ముందడుగని అన్నారు.