
జెరూసలేం: కొత్త వేరియంట్ ఉధృతి కారణంగా దేశంలో ఆంక్షలు విధించినప్పటికీ మిస్ యూనివర్స్ 2021 పోటీలను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ దేశ పర్యాటక మంత్రి యోయెల్ రాజ్‌వొజొవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎలీట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే ఈ పోటీలో పాల్గొనేవారికి ప్రతి 48 గంటలకు పిసిఆర్ పరీక్షలతోపాటు ఇతర భద్రతా చర్యలకు లోబడి నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దాదాపుగా 174 దేశాల్లో ఈవెంట్‌కు సంబంధించిన కార్యక్రమం ప్రసారం అవుతుందని, దీనిని రద్దు చేయలేమని ఆయన పేర్కొన్నారు. కాగా దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment