Miss Universe 2021 Harnaaz Sandhu Won Crown to This Final Question: ఇజ్రాయేల్ ఇలాట్ వేదికగా జరిగిన 70వ విశ్వ సుందరి వేడుకల్లో భారత యువతి హర్నాజ్ సంధు కిరీటం దక్కించుకుంది. విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన మూడో భారత యువతిగా నిలిచింది హర్నాజ్. గతంలో సుస్మితా సేన్, లారా దత్తా ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. తాజాగా జరిగిన పోటీల్లో 80 మందిని వెనక్కి నెట్టి.. కిరీటం గెలుచుకున్నారు హర్నాజ్.
హర్నాజ్‌కు కిరీటాన్ని అందించిన ప్రశ్న ఏంటనే ఆసక్తి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక ఫైనల్ రౌండ్‌లో ముగ్గురు ఫైనలిస్ట్‌లు మిగిలారు. వీరిని జడ్జిలు ‘‘ఈ షో చూస్తున్న మహిళలుకు మీరిచ్చే సలహా ఏంటని’’ ప్రశ్నించారు. మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ పరాగ్వేతో పాటు మిస్ ఇండియా హర్నాజ్ చక్కగా సమాధానమిచ్చి పోటీ రౌండ్‌లను ముగించారు. ముగ్గురిలో అత్యుత్తమ సమాధానం చెప్పిన హర్నాజ్‌ను కిరీటం వరించింది. ఆమెను విజేతగా ప్రకటించి.. మిస్ మెక్సికో నుంచి కిరీటాన్ని మిస్ ఇండియా హర్నాజ్‌కు అందించారు.
(చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి)
హర్నాజ్ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మండి.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులుతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాల నుంచి బయటకు రండి.. మీ గురించి మీరే మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్. మీకు మీరే గొంతుక. నన్ను నేను నమ్మాను.. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను’’ అని సమాధానమిచ్చారు హర్నాజ్.
(చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?)
The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4
— Miss Universe (@MissUniverse) December 13, 2021
హర్నాజ్ సమాధానం జడ్జిలతో పాటు ప్రజలకు నచ్చింది. దాంతో మిస్ ఇండియా హర్నాజ్ కౌర్ సంధును విజేతగా స్టీవ్ హార్వే ప్రకటించగానే, స్టేడియం మొత్తం సందడి నెలకొంది. తన పేరును విజేతగా ప్రకటించిన వెంటనే హర్నాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్‌కి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్‌గా మిస్ సౌత్ ఆఫ్రికా నిలిచారు. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, హర్నాజ్ మొదట్లో టాప్ 16కి చేరుకుంది. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత, ఆమె టాప్ 10లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment