దేశీ విమాన ప్రయాణిలకు రద్దీ 5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ మార్చి నె లలో 5.3 శాతం మేర పెరిగింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. దేశీ విమానయాన సంస్థలు మార్చిలో మొత్తంగా 78.72 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ సంఖ్య ఫిబ్రవరిలో 74.72 లక్షలుగా ఉంది. ఇక మార్కెట్ వాటా విషయానికి వస్తే.. ఇండిగో 38.4 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్‌వేస్ (17.6 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం) ఉన్నాయి.