
శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాత్రి 1.20 గంటలకు పుణే నుంచి ఇండిగో విమానం శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇండిగో వి మానం (6ఈ 732) ఇక్కడి నుంచి లక్నో వెళ్లడానికి షెడ్యూల్ నిర్ధారించినట్టు ఆదివారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 30 వరకు రాకపోకలు సాగించే విమానాల రాకపోకల షె డ్యూల్‌ను, నిర్ధారిత వేళల పట్టికను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. షెడ్యూ ల్‌లో మార్పుచేర్పులు ఉండనున్నాయి.
నేడు గన్నవరం, విశాఖ సర్వీసులు రద్దు
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రా రంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ సాంకేతిక కారణాలు వల్ల రద్దయ్యాయి. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment