సీఐటీఏ నివేదిక
న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవడంలో, ప్రపంచంలోని ఇతర సంస్థలతో దేశీ విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయని సీఐటీఏ పేర్కొంది. ‘2016 ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీ–ఇండియా ఐటీ ట్రెండ్స్ బెంచ్‌మార్క్’ అనే పేరుతో గ్లోబల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీఐటీఏ ఒక సర్వే నిర్వహించింది.
దీని ప్రకారం..
⇔ 2019 నాటికి ఐఏటీఏ బ్యాగేజ్ ట్రాకింగ్ సొల్యూషన్స్‌ను పూర్తిగా అమల్లోకి తీసుకురావాలని దేశీ ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి.
⇔ అవరోధాలను ముందుగానే గుర్తించి, వాటి ప్రభావాలను అంచనా వేయగలిగే వ్యవస్థలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేసుకోవాలని 60 శాతం దేశీ ఎయిర్‌పోర్ట్‌లు ప్రయత్నిస్తున్నాయి.
⇔ దాదాపు 75 శాతం విమానయాన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సామరŠాథ్యలను పెంపొందించుకోవడంలో ప్రారంభ దశలో ఉన్నాయి.
⇔ 40 శాతం ఎయిర్‌లైన్స్ కొత్త డిస్ట్రిబ్యూషన్ క్యాపబిలిటీ (ఎన్‌డీసీ) సంబంధిత రిసోర్సెస్‌లలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి.
⇔ దాదాపు 98 శాతం మంది భారతీయ ప్రయాణికులు వారి ప్రయాణంలో మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్ వంటి వాటిల్లో ఏదోఒకదాన్ని వెంట తీసుకెళ్తున్నారు. 32% మంది అన్నింటినీ పట్టుకెళ్తున్నారు. ఇది గ్లోబల్ సగటు కన్నా చాలా ఎక్కువ.
కొత్త టెక్నాలజీ వినియోగంలో దేశీ విమాన సంస్థల జోరు
Published Tue, Dec 20 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
Advertisement