సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ విమానాలు దేశవ్యాప్తంగా దూసుకెళ్తున్నాయి. దేశీయ విమానాల రాకపోకల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కోవిడ్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన విమాన సర్వీసులను మే నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. పరిమిత రూట్లలో సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతోపాటు ఎయిర్‌పోర్టులో కోవిడ్ నియంత్రణ చర్యలు, ప్రస్తుతం ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షా కేంద్రం అందుబాటులో ఉన్నందున ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మేలో నిత్యం 3 వేల మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం వారి సంఖ్య 37 వేలకు చేరుకుంది. మే నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికుల వైద్య పరీక్షల ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో విమానరంగం వేగం పుంజుకున్నట్లు చెప్పారు.
పది రెట్లు పెరిగిన ప్రయాణికులు..
⇔ మే 25 నుంచి దేశీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. మొదటి కొన్ని వారాల్లో హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 3 వేల మంది రాకపోకలు సాగించారు.
⇔ నవంబర్ నుంచి ప్రయాణికుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఇది విమాన సరీ్వసులు పునఃప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
⇔ మే 25 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
⇔ మొదట్లో నిత్యం 40 విమానాలు రాకపోకలు సాగించగా ప్రస్తుతం 260 దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమాన సరీ్వసులు పునఃప్రారంభమైన మొదటి రోజుకు ఇది 6 రెట్ల కంటే ఎక్కువ. నవంబర్ 23 వరకు 35 వేల విమానాల నడిచాయి.
⇔ ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 37 వేలకు చేరుకుంది. అలాగే విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284ను దాటింది.
⇔ కోవిడ్‌కు ముందు హైదరాబాద్ నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, ప్రస్తుతం 51 గమ్యస్థానాలకు సరీ్వసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా కొత్తగా కోజికోడ్, ఇంపాల్, జగదల్‌పూర్‌లకు కూడా సరీ్వసులు ప్రారంభమయ్యాయి.
నమ్మకానికి ప్రతీక..
జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ.. విమాన ప్రయాణంపై ప్రయాణికుల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ 30 లక్షల మంది ప్రయాణికులు ఒక తార్కాణమన్నారు. కోవిడ్‌కు పూర్వం ఉన్న సామర్థ్యంలో 70 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సురక్షితమైన రాకపోకల కోసం ఎయిర్‌పోర్టులో ఉన్నచోట్ల కాంటాక్ట్ లెస్ సేవలను అందుబాటులోకి తెచి్చనట్లు పేర్కొన్నారు. త్వరలోనే కోవిడ్ పూర్వ పరిస్థితులు ఏర్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment