రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి ఏడు కిలోల ....
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో గురువారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఏడు కిలోల వంద గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీరు ముంబైకి చెందిన సమీరా, సిందియాలుగా గుర్తించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.