శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే నాలుగు ట్రూ జెట్ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే నాలుగు ట్రూ జెట్ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన 2టీ 101 విమానం రద్దు కావడంతో సుమారు 70 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సర్వీసు నిలిపివేతకు కారణాలు తెలియకపోవడంతో ప్రయాణికులు సదరు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతోపాటు ఉదయం 11.30 గంటలకు ఔరంగాబాద్, సాయంత్రం 3 గంటలకు బెంగళూరు వెళ్లే విమానాలతోపాటు 6.20 గంటలకు చెన్నై వెళ్లాల్సిన విమానాలను కూడా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసింది. విమానాలను రద్దుకు గల కారణాలను వెల్లడించలేదు.