సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. మధ్యాహ్నం 2.30కు ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయల్దేరలేకపోయింది. దీంతో గంట నుంచి రేవంత్, భట్టి, టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి విమానంలోనే ఉండిపోయారు.
కాగా సీఎం రేవంత్, భట్టి, పొన్నం, దీపాదాస్ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నేడు ముంబైలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది.
చదవండి: ఇక రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment