
పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు
రంగారెడ్డి (శంషాబాద్) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి పాదరక్షల అడుగుభాగం నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దుబాయ్ నుంచి బయలుదేరి గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పాదరక్షల అడుగుభాగంలో దాచుకొని తీసుకొచ్చిన కిలో పది గ్రాముల బరువున్న నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.