శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎలక్ట్రికల్ స్టౌ కింది భాగంలో కిలో బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు ముంబైకి చెందిన రఫీక్‌గా గుర్తించారు.
విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
Published Sat, Jun 20 2015 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement
Advertisement