
సాక్షి, అనంతపురం: బెంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్‌లో సురేష్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్‌తో స్లీపర్ కోచ్ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
పోలీస్ దాడి చేసిన దృశ్యాలను తోటి ప్రయాణికులు వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోలో పోలీస్ సురేష్‌ను లాఠీతో దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణికుడు చెబుతున్న వినిపించుకోకుండా అలానే దాడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ప్రయాణికుడు సురేష్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. అకారణంగా నన్ను రైల్వే పోలీసులు కొట్టారని తన బాధను వ్యక్తం చేశాడు. ఈ దాడిపై తోటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment