పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి! | Schoolboy Celebrating Last Exam Rams Car Into Pavement | Sakshi
Sakshi News home page

పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి!

Published Thu, Apr 20 2017 10:49 AM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM

పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి! - Sakshi

పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి!

12వ తరగతి (ఇంటర్‌) పరీక్షలు ముగిసిపోయాయన్న ఆనందంతో ఓ స్కూల్‌ విద్యార్థి అడ్డగోలుగా కారు నడిపి.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకొని గురువారం తెల్లవారుజామున కారులో విహరిస్తూ అతడు పేవ్‌మెంట్‌ మీద పడుకుంటున్న అభాగ్యులపై వాహనాన్ని నడిపాడు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.

ఢిల్లీ కాశ్మీర్‌గేట్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కారులో దూసుకొచ్చిన 12వ తరగతి విద్యార్థి ఈ ప్రమాదానికి ఒడిగట్టాడు. మైనర్‌ అయిన సదరు విద్యార్థి ఓ టాప్‌ స్కూల్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతనితోపాటు కారులో ఉన్న అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement