గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్‌ విద్యార్థి మృతి | Tenth Student Dies After Falling Under RTC Bus In Hyderabad Gachibowli, More Details Inside | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్‌ విద్యార్థి మృతి

Published Sat, Mar 22 2025 3:00 PM | Last Updated on Sat, Mar 22 2025 3:18 PM

Tenth Student Dies After Falling Under Rtc Bus In Gachibowli

నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్‌ విద్యార్థి మృతి చెందింది. టెన్త్‌ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్‌పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.

గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్‌లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్‌ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్‌పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement