
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కానున్నారు. విద్యార్థులు/తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ ్టtgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్‌నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.