ఆస్తి కోసం కుటుంబసభ్యులనే చంపేశాడు | Man kills six members of his family | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కుటుంబసభ్యులనే చంపేశాడు

Published Fri, Jan 24 2014 12:25 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man kills six members of his family

కుటుంబసభ్యుల ప్రేమాభిమానాల కన్నా ఆస్తి పాస్తులే ఎక్కువ అనుకున్నాడు ఓ ప్రబుద్దుడు. దాంతో కుటుంబ సభ్యులలోని ఆరుగురిని కడతేర్చాడు ఆ ప్రబుద్ధుడు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ బులంద్ష్రార్ సమీపంలోని పిల్హనా గ్రామంలో నిన్న చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలోని ఓ కుటుంబంలో గత కొద్ది కాలంగా ఆస్తిపై వివాదం నెలకొంది. ఇటీవల కాలంలో ఆ తగదాలు పెచ్చురిల్లాయి. దాంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు గత రాత్రి తండ్రి, అన్న వదినలు, వారి ఇద్దరు చిన్నారులతోపాటు మరోకరిని దారుణంగా నరికి చంపాడు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో పోలీసులు హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు రక్తపు మడుగులోపడి విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి అలోక్ శర్శ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement