
ప్రతీకాత్మక చిత్రం
బులంద్‌షహర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని ఓ స్కూల్లో.. తరగతి గదిలో సీట్ల విషయంలో వచ్చిన గొడవకు 10వ తరగతి చదివే సన్నీ (14)తన తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. సెలవుల్లో ఆర్మీ నుంచి ఇంటికి వచ్చిన తన అంకుల్ లైసెన్స్ గన్‌తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాల్చిన అనంతరం పారిపోబోయాడు. అయితే అప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గేట్లు మూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికాడు. కాగా పోలీసులు వివరాలు నమోదు చేసుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment