Pilkhana
-
బాలుడిపై పైశాచికం
న్యూఢిల్లీ: 14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ సమీపంలోని పిల్ఖానా గ్రామంలో చోటుచేసుకుంది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు రాజ్యసభలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతి రోజే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. 8 మంది బాలురు తన చేతులను కట్టేసి దుస్తులు తొలగించారని బాధిత బాలుడు ఆరోపించాడు. తనను వదిలిపెట్టమని ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించకుండా కొట్టారని, చివరకు తనపై మూత్ర విసర్జన చేసి విడిచిపెట్టారని గోడు చెప్పుకున్నాడు. తనను దుర్భాషలాడుతూ దళితుడినని పదేపదే హేళన చేశారని, వారిలో ఒకడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడని చెప్పాడు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని అలీగఢ్ ఎస్పీ రాజేశ్ పాండే తెలిపారు. -
ఆస్తి కోసం కుటుంబసభ్యులనే చంపేశాడు
కుటుంబసభ్యుల ప్రేమాభిమానాల కన్నా ఆస్తి పాస్తులే ఎక్కువ అనుకున్నాడు ఓ ప్రబుద్దుడు. దాంతో కుటుంబ సభ్యులలోని ఆరుగురిని కడతేర్చాడు ఆ ప్రబుద్ధుడు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ బులంద్ష్రార్ సమీపంలోని పిల్హనా గ్రామంలో నిన్న చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలోని ఓ కుటుంబంలో గత కొద్ది కాలంగా ఆస్తిపై వివాదం నెలకొంది. ఇటీవల కాలంలో ఆ తగదాలు పెచ్చురిల్లాయి. దాంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు గత రాత్రి తండ్రి, అన్న వదినలు, వారి ఇద్దరు చిన్నారులతోపాటు మరోకరిని దారుణంగా నరికి చంపాడు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు రక్తపు మడుగులోపడి విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి అలోక్ శర్శ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఉన్నతాధికారి తెలిపారు.