బులంద్ షహర్ః ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ పై వచ్చిన యువకులు వృద్ధ దంపతులను దోచుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన తల్లీ కూతుళ్ళపై అత్యాచారం ఘటన జరిగిన బులంద్ షహర్ ప్రాంతంలోనే ఈ దాడి జరగడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.
బటూనా గ్రామంలో పశుగ్రాసాన్ని ఎద్దులబండిలో వేసుకొని వెడుతున్న 55 ఏళ్ళ బిజేంద్రి, ఆమె భర్త 60 ఏళ్ళ విక్రమ్ సింగ్ లపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు. ఉన్నట్లుండి మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు యువకులు వారి బండిని అడ్డగించడంతోపాటు.. బిజేంద్రి చేతికున్న బంగారు గాజులు, చెవి కమ్మెలను దోచుకునేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకోబోయిన బిజేంద్రి తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విక్రమ్ సింగ్ ను కూడా యువకులు బలంగా తోయడంతో కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయని, భార్యాభర్తలు ఇంటికి చేరుకునే లోపే ఈ దారుణం జరిగిందని ఎస్పీ మాన్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
లూటీ యత్నం.. మహిళ మృతి
Published Wed, Sep 28 2016 7:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement
Advertisement