లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.
అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.
UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9
— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024
Comments
Please login to add a commentAdd a comment