Railing
-
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా..
ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్‌కుమార్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్‌గార్డ్. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ పక్కన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు. అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్‌కుమార్ హెల్మెట్ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్‌హెచ్ 16 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్‌కుమార్ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. -
వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
మెక్సికో : సైలెంట్‌గా దొంగతనం చేసి ఉడాయిద్దామనుకున్న ఆ దొంగోడి ప్లాన్ బెడిసి కొట్టింది. దొంగతనం చేసిన డబ్బులతో జల్సా చేద్దామనుకుంటే అతడ్ని దురదృష్టం వెంటాడింది. తల రైలింగ్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. రైలింగ్ నుంచి ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించగా, అనుకోకుండా అతడి తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు చాలానే ట్రై చేవాడు కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. కొంత సమయానికి ఇది గమనించిన స్థానికులు.. దొంగోడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని రైలింగ్ నుంచి విడిపించలేకపోలేరు. దీంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించగా, రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది...బోల్డ్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్ చేసి అతడిని విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చదవండి : వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం! -
ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా?
తిరుమల భద్రత కోసం శేషాచలంలోని అటవీ మార్గాలను కలుపుతూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పేరుతో ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. తొలి దశ పనులు పూర్తయినా రెండో దశపనులపై దృష్టి సారించడంలేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఖర్చు తడిసిమోపెడవుతుందని టీటీడీ ఓ ఉన్నతాధికారి ఈ పనులకు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. తిరుమల: తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని దశాబ్దం ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతాపరమైన సిఫారసుతో ఆలయం చుట్టూ ఉండే అటవీ ప్రాంతాలను కలుపూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ (ఇనుప కంచె) నిర్మించాలని నిర్ణయించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మూడేళ్లకు ముందు ఆమోద ముద్రవేసింది. ఇందులో భాగంగా మొత్తం 12 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు 2014లో ప్రారంభించారు. తొలిదశ పనుల్లో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో 57 మలుపు నుంచి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం వరకు మొత్తం 4.8 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం రూ.2 కోట్ల అంచనాలతో రెండు కి.మీ దూరం పనులు చేపట్టారు. ఆ మేరకు పనులు పూర్తి చేశారు. ఈ పనులు స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ దిగువ భాగం వరకు పూర్తయ్యాయి. రెండో దశ కంచె పనులపై టీటీడీ సందిగ్ధం 2.8 కి.మీ మేర రెండో దశ పనులకు టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకారం తెలిపింది. పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డు మార్గం వరకు ఇనుప కంచె నిర్మించనున్నారు. దీనికోసం దాదాపు రూ.2 కోట్లు కేటాయించారు. అయితే, శ్రీగంధం వనాన్ని టీటీడీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 30 ఎకరాల్లో ఉండే ఈ వనాన్ని 145 ఎకరాలకు విస్తరించాలని టీటీడీ యోచిస్తోంది. భవిష్యత్ భద్రతా కారణాల వల్ల శ్రీగంధం వనాన్ని రక్షించుకునే దిశగా కొత్త వనాన్ని కూడా ఇనుప కంచెలోపలికి తీసుకురావడానికి టీటీడీ నిర్ణయించింది. దీంతో మరో రెండు కిలోమీటర్లు మేర పెంచి సుమారు రూ.4.5 కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, ఇంత ఖర్చు పెట్టి కంచె నిర్మించాలా? అంటూ టీటీడీకి చెందిన ఓ సీనియర్ అధికారి నిర్మాణంపనులపై మోకాలడ్డేశారు. అందుకే పనులు ఏడాదిగా సాగడం లేదు. కంచె పూర్తి చేయాల్సిందే ఉగ్రవాద చర్యల నేపథ్యంలో తిరుమలలో నిర్మాణంలో ఉన్న ఇనుప కంచెను సాధ్యమైనంత త్వరలోనే పూర్తిచేయాలని రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు టీటీడీకి సిఫారసు చేశారు. దీంతో కంచె నిర్మాణం పూర్తి చేసే ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా? యోచనలేని టీటీడీలో కొంత చలనం వచ్చినట్టయింది. ఇనుప కంచె పరిశీలన తిరుమల అటవీమార్గాలను చుట్టూ కలుపుతూ చేపట్టిన ఇనుప కంచె నిర్మాణాన్ని సోమవారం డీఎస్పీ మునిరామయ్య, సీఐలు కె.వెంకటరవి, విజయ్‌శేఖర్, ఎస్ఐ వెంక్రటమణ పరిశీలించారు. డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలతో టీటీడీ, పోలీసు విభాగాల్లో చనలం వచ్చింది. ఆమేరకు ఇప్పటికే పూర్తిచేసిన తొలి దశ పనులు పరిశీలించారు. వాటి వివరాలను టీటీడీ డెప్యూటీ ఈఈ పెద్దబ్బరెడ్డి పోలీసు అధికారులకు వివరించారు. -
భవనం పైనుండి పడి విద్యార్థిని మృతి
నేరేడ్మెట్ (హైదరాబాద్) : నిర్మాణంలో ఉన్న ఇంటి రెయిలింగ్‌కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి కాలనీలో నివాసముండే వెంకటేశ్వర రెడ్డి ఆయన ఉన్న ఇంటిపైన రెండవ అంతస్తులో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. కాగా డిగ్రీ చదువుకునే వెంకటేశ్వరరెడ్డి కుమార్తె కుమారి నవ్యశ్రీ (19) ఆదివారం రెండవ అంతస్తులో నిర్మాణం చేస్తున్న రెయిలింగ్‌కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు రెయిలింగ్‌తోపాటు నవ్యశ్రీ కింద పడిపోయి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్నత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి
మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వారంలో 5 రోజులు ‘ఇంటి’ కూరలే!
చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తి ఆమెను ఇంటిపంటల వైపు దృష్టి మళ్లించేందుకు పురికొల్పింది. మేడపైన ఉన్న కొద్ది పాటి స్థలాన్ని పొందికగా ఉపయోగించుకొని 20 రకాలకు పైగా ఇంటిపంటలను సాగు చే స్తున్నారు రాయకంటి లీలారవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమలానగర్ కాలనీలో స్వగృహంలో నివసిస్తూ.. గత రెండేళ్లుగా గృహిణిగా తనకున్న ఖాళీ సమయాన్ని ఇంటిపంటలకు వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు గల తమ కుటుంబానికి వారానికి ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కాయగూరలు, ఆకుకూరలు తమ ఇంటిపైనే పండిస్తున్నారు. 350కు పైగా మట్టి, సిమెంట్ కుండీల్లో కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతున్నారు. వంగ, టమాట, చెట్టు చిక్కుడు, మిరప, సొర, బీర, కాకర, దోస వంటి కూరగాయలతోపాటు పుదీనా, కొత్తిమీర, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. మొక్కలను పెంచేందుకు రెండు పాళ్లు ఎర్రమట్టి, ఒక పాలు మాగిన ఆవు పేడ, కొంచెం ఇసుక, వేపపిండి కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. కుండీ అడుగున రంధ్రాలు పూడిపోకుండా ఉండేందుకు ముందు రెండంగుళాల మందాన గులక రాళ్లు వేసి ఆపైన మట్టి మిశ్రమం నింపుతారు. ఈ మట్టి మిశ్రమాన్ని రెండేళ్లకోసారి పూర్తిగా మార్చేస్తానని ఆమె తెలిపారు. వంటింటి వ్యర్థాలు, గంజి, బియ్యం కడిగిన నీళ్లను మొక్కల పోషణకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఆవు పిడకల బూడిదకు.. వేపాకు పిండి, పసుపు కలిపి మొక్కలపై చల్లి, చీడపీడలను నివారిస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయ మొక్కలను కొన్ని కుండీల్లో కలిపి వేశారు. దీని వల్ల తక్కువ కుండీల్లోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చంటున్నారావిడ. తీగ జాతి కూరలు పాకేందుకు రెయిలింగ్‌కు ప్లాస్టిక్ వైర్లు కట్టి పందిళ్లు ఏర్పాటు చేశారు. ‘ఆరోగ్యకరమైన కూరలను ఇంటిపట్టునే పెంచుకోవటం సంతృప్తినిస్తోంది. ఆ కూరల రుచిని కుటుంబ సభ్యులు మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అంటున్నారు లీలారవి (99498 94433). -
మన బస్సుల భద్రత ఎంత
కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్ అధ్వానంగా కరకట్టలపై రోడ్లు 70 రూట్లలో 500 పల్లె వెలుగు బస్సుల రాకపోకలు విద్యార్థులంతా ఆ సర్వీసుల్లోనే.. ‘అనంత’ ఘటనతో ఆందోళనలో జిల్లా వాసులు విజయవాడ : డొక్కు బస్సులు.. కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్.. కరకట్టలపై గోతులమయమైన రోడ్లు జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించ డంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువంటి బస్సుల్లోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్న తమ పరిస్థితి ఏమిటని జిల్లా అంతటా చర్చసాగుతోంది. జిల్లాలో 500 వరకు పల్లెవెలుగు బస్సులున్నాయి. ఈ బస్సులు ప్రధానంగా 70 రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ-మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుడివాడ, అవనిగడ్డ, నందిగామ, మైలవరం, నూజివీడు తదితర రూట్లలో నిత్యం 60కి పైగా పల్లెవెలుగు సర్వీసలు నడుస్తున్నాయి. అయితే ప్రతి బస్సు రోజూ సగటున 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నగరశివారు ప్రాంతాలైన కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రధాన రూట్లలో ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో పాసులు అంగీకరించకపోవడంతో విద్యార్థులు పల్లెవెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాలో గడచిన నాలుగేళ్ల కాలంలో పల్లెవెలుగు బస్సు ప్రమాదాలు జరిగిన దాఖాలాలు లేవు. అయితే తరచూ రోడ్లపై మొరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెవెలుగు బస్సులను ఆర్టీసీ అధికారులు సక్రమంగా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. నిత్యం బస్సు కండిషన్‌ను పరిశీలించడంతోపాటు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తప్పనిసరిగా బస్సులను పూర్తి స్థాయిలో ఫిట్నెస్ను పరీక్షించాల్సి ఉంది. జిల్లాలో ఇటువంటి చర్యలేమీ తీసుకోవడం లేదు. గుడివాడ మార్గంలో జరభద్రం జిల్లాలో ప్రధానంగా గుడివాడ-విజయవాడ మార్గం ప్రమాదభరితంగా ఉంది. కోమటిగుంటలాకులు నుంచి గుడివాడ వరకు రోడ్డుకు ఒకవైపు కాలువ ఉండడం అది కూడా ప్రమాద భరితంగా ఉండడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో వెంట్రప్రగడ నుంచి రోడ్డుకు ఇరువైపులా కాలువలు ఉండటం, కరకట్ట రోడ్డు కావడంతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాలకు జాతీయ రహదారి నుంచి వెళ్లేక్రాస్ రోడ్లలో తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటుచేయాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోని వడ్లమూడి-తెనాలి మార్గంలో రోడ్డుకి రెండు వైపులా కాలువలు ఉండటంతో అత్యతం ప్రమాద భరింతంగా ఉంటుంది. ఈమార్గంలో ఏడాదికి సగటున 10 వరకు ప్రమాలు జరుగుతున్నాయి. కరకట్టలపై రైలింగ్ అవసరం జిల్లాలోని కరకట్ట ప్రాంతాలకు రైలింగ్ ఏర్పాటుచేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు తెలిపారు. ముఖ్యంగా కాలువకట్ట, లోయ, కొండమార్గాల్లో రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్లే విధిగా రైలింగ్, బారికేడ్లు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అప్రమత్తత అవసరం : ఆర్టీసీ ఈడీ నాగరాజు ఆర్టీసీ డ్రైవర్లు విధిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని ఆర్టీసీ ఈడీ నాగరాజు సూచించారు. తరచూ తాము బస్సులను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. -
‘కంచె’ నిర్ణయం గవర్నర్దే: హరీష్‌రావు
రెండు రాష్ట్రాల సచివాలయాల మధ్య ఇనుపకంచె ఎందుకంటూ బాబు చేసిన వ్యాఖ్యలపైనా హరీష్‌రావు స్పందించారు. కంచె వేయాలన్న నిర్ణయం తమ ప్రభుత్వానిది కాదని, అది గవర్నర్ తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. ఆ నిర్ణయం మాది కాదు: రాజ్‌భవన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య కంచె నిర్మించాలన్న నిర్ణయం గవర్నర్‌ది కాదని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం నరసింహన్‌ది కాదని గవర్నర్ ప్రెస్ సెక్రటరీ కృష్ణానంద్ ఒక ప్రకటన జారీ చేశారు. కాదు నేను చెప్పిందే కరెక్ట్: హరీష్ రాజ్‌భవన్ స్పందన తర్వాత గురువారం రాత్రి మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటన విడుదల చేస్తూ... కంచె విషయంలో తాను చెప్పిందే కరెక్టన్నారు. కంచె ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 26న జీవో జారీ అయిందని, అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గుర్తుచేశారు.