రెండు రాష్ట్రాల సచివాలయాల మధ్య ఇనుపకంచె ఎందుకంటూ బాబు చేసిన వ్యాఖ్యలపైనా హరీష్‌రావు స్పందించారు. కంచె వేయాలన్న నిర్ణయం తమ ప్రభుత్వానిది కాదని, అది గవర్నర్ తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు.
ఆ నిర్ణయం మాది కాదు: రాజ్‌భవన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య కంచె నిర్మించాలన్న నిర్ణయం గవర్నర్‌ది కాదని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం నరసింహన్‌ది కాదని గవర్నర్ ప్రెస్ సెక్రటరీ కృష్ణానంద్ ఒక ప్రకటన జారీ చేశారు.
కాదు నేను చెప్పిందే కరెక్ట్: హరీష్
రాజ్‌భవన్ స్పందన తర్వాత గురువారం రాత్రి మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటన విడుదల చేస్తూ... కంచె విషయంలో తాను చెప్పిందే కరెక్టన్నారు. కంచె ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 26న జీవో జారీ అయిందని, అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గుర్తుచేశారు.
‘కంచె’ నిర్ణయం గవర్నర్‌దే: హరీష్‌రావు
Published Fri, Jul 4 2014 1:18 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement