
ఉత్తర్ ప్రదేశ్: మంచి చెప్పడమే పాపం అయింది. ఆలుమగల మద్య గొడవ వద్దు అని చెప్పిన వ్యక్తి యాసిడ్ దాడిలో మృతిచెందగా.. అతని భార్య కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జలో వెలుగుచూసింది. పట్టణంలోని నవాల్పురా ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న రామ్‌కుమార్ అతని భార్యతో తరచు గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న రామ్‌కుమార్ అన్న ప్రహ్లాద్(30), వదిన మునేష్ దేవి(28) వారిని వారించి ఇంట్లోకి పంపారు. దీంతో అన్నా వదినలపై కోపం పెంచుకున్న రామ్‌కుమార్ వారిపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. మునేష్ దేవి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడిలో కుమార్‌కు కూడా గాయాలు కావడంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు జిల్లా రూరల్ ఎస్పీ పి.కే తివారీ వివరాలు తెలిపారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment