ఆగ్రా: అత్యాచారానికి పాల్పడిన వారిని చర్మం ఊడేంతవరకు చిత్రహింసలు పెట్టాలని జలవనరుల మంత్రి ఉమాభారతి అన్నారు. బులంద్‌షహర్ అకృత్యం కేసులో బాధితులకు న్యాయం చేయటంలో ఎస్పీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగిస్తూ.. రేప్ చేసిన వారిని తలకిందులుగా కట్టేసి చర్మం ఊడేవరకు చిత్రహింసలు పెట్టాలన్నారు. గాయాలకు ఉప్పు, కారం పూసి ప్రాణం కోసం బతిమాలుకునేంతవరకూ వదలిపెట్టొదన్నారు.