బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి | Not Giving Tickets to Muslims in UP Polls a Mistake: Uma Bharti | Sakshi
Sakshi News home page

బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి

Published Mon, Feb 27 2017 10:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి - Sakshi

బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు సబబనని ఉమా భారతి అన్నారు. అయితే కొన్నిసార్లు ముస్లింలకు, మహిళలకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ విషయం గురించి చర్చిస్తానన్నారు. సోమవారం యూపీలో ఐదో దశ ఎన్నికలు 52 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. కీలకమైన అమేథి, అయోధ్య నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement