లక్నో : మీకు ఇద్దరు మనుషులు చనిపోవడం మాత్రమే కనిపిస్తోంది.. కానీ అక్కడ మరో 21 ఆవులు కూడా చనిపోయాయి.. అది మీకు కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ శర్మ. కొన్ని రోజుల క్రితం బులందషహర్ ప్రాంతంలో జరిగిన మూక దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనక వేరే ఉద్దేశాలున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సంఘటనల గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ మౌనంగా ఉన్నారు. దాంతో ఆగ్రహించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు ఈ విషయం గురించి పూర్తిగా విచారణ చెపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సంజయ్ శర్మ ‘కేవలం ఇద్దరు మనుషులు చనిపోయారని ఇంత రాద్ధంతం చేస్తున్నారు. కానీ అక్కడ 21 గోవులు కూడా చనిపోయాయి. ఆవులను చంపేవారే నిజమైన నేరస్తులు. గోమాతను చంపుతున్నారనే ఆగ్రహంతోనే ఈ మూక దాడి చర్యలు పుట్టుకొచ్చాయం’టూ సంజయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడిలో ఇద్దరూ పోలీస్ అధికారులు మరణించినప్పటికి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ఆదిత్యనాథ్‌కు మనుషుల ప్రాణాలకంటే గోవుల గురించి చింతే ఎక్కువైంది. గో రక్షణ పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్న చలించడం లేద’ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరిన్ని విమర్శలకు అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment