minor killed
-
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
మూకహత్య : మరో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: మూకహత్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కొనసాగుతుండగానే దేశ రాజధాని నగరంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక మైనర్‌ను తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉద్రిక్తత రేపింది. నార్త్-వెస్ట్ ఢిల్లీ, ఆదర్శ్ నగర్లో శుక్రవారం ఉదయం ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆదర్శ్ నగర్లో మైనర్ హత్య శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మైనర్‌బాలుడు సాహిల్ (16) పొరుగువారి నివాసంలోకి వచ్చాడు. అదే సమయంలో నిద్రనుంచి మొల్కొన్న ఇంటి యజమాని ముఖేష్ ..అతను దొంగతనానికి వచ్చాడని భావించాడు. అతణ్ని పట్టుకొని చుట్టుపక్కల వారినందర్నీ పిలిచాడు. దీంతో అందరూ గుమిగూడి సాహిల్‌ను తీవ్రంగా కొట్టం ప్రారంభించారు. అయితే కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు గాయపడిన సాహిల్‌ను జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ తీవ్ర గాయాలతో సాహిల్ ప్రాణాలొదిలాడు. ఈ ఘటనలో ముఖేష్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ హత్యపై అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దొంగతనం చేసే అలవాటు తమ పిల్లవాడికి లేదనీ, ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా వుండేవాడని నానమ్మ వాపోయింది. -
నమాజ్ చేయలేదని బాలికను చంపేశారు!
ముంబై: విధిగా నమాజ్ చేయడంలేదన్న కారణంగా ఓ బాలికను ఆమె కుటుంబీకులే హత్యచేశారు. ముంబైలోని అన్టాప్ హిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. బాలికను చంపిన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్టాప్ హిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పథాంకర్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. ఏలా జరిగింది?: తల్లి చనిపోవడంతో 15 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా దగ్గరి బంధువుల ఇంట్లో ఉంటోంది. పని ఒత్తిడి కారణంగా పాపను చూసుకునే అవకాశం లేకపోవడంతో తండ్రి ఆ ఏర్పాటుచేశాడు. వరుసకు అత్తయ్యే మహిళ.. విధిగా నమాజ్ చేయాల్సిందిగా బాలికను వత్తిడిచేసేది. ప్రార్థన పట్ల ఆసక్తిలేని ఆ బాలిక అత్తమాట వినేదికాదు. ఇదే విషయంలో మొన్న శుక్రవారం వాగ్వాదం జరిగింది. పట్టరాని కోపానికిగురైన అత్త.. చున్నీని బాలిక మెడకు బిగించి చంపేసింది. కప్పిపుచ్చేయత్నం: క్షణికావేశంలో చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఆ అత్త, ఆమె కుటుంబీకులు నానా తంటాలు పడ్డారు. బాత్రూమ్లో జారిపడిందంటూ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప మెడపై కమిలిన గుర్తులను గమనించిన డాక్టర్లు.. మరుక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. చివరికి ఇంటరాగేషన్‌లో నేరం చేసినట్లు అంగీకరించారు. బాలిక అత్తను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు. షాక్‌కు గురైన తండ్రి: బాలిక మరణవార్త విన్న తండ్రి షాక్‌కు గురయ్యాడు. ‘‘బాగా చూసుకుంటారన్న నమ్మకంతోనే నా బిడ్డను వాళ్లింట్లో ఉంచాను. ఆ దుర్మార్గులు ఇంత పని చేస్తారనుకోలేదు. అయినా, నమాజ్ చెయ్యకుంటే ఆ విషయం నాకు చెప్పాలిగానీ చంపడమేంటి?’ అని భోరున విలపించాడా తండ్రి. -
సిలిండర్ పేలి బాలుడు మృతి
అర్వాల్: గ్యాస్ సిలిండర్ పేలి పన్నెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని అర్వాల్ జిల్లా బానియా బిఘాలో చోటుచేసుకుంది. వంట చేసేందుకు స్టవ్ వెలిగించే సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఐశు కుమార్ అనే పన్నేండళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు, మరొక పొరిగింటి వ్యక్తి గాయాలపాలయ్యారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.