Revenge murder
-
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..!
న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట ప్రేమ వ్యవహారం నడిపించారు. అది తెలిసిన యజమానికి పని లోంచి తొలగించాడని కక్ష పెంచుకున్నారు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు. యజమాని దంపతులతో పాటు పని మనిషిని సైతం దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంగానే పగ పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల చిన్న పాప ఇంట్లో నిద్రపోతున్న నేపథ్యంలో చిన్నారిని గమనించలేదని చెప్పారు. ఏం జరిగింది? తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో శాలు అహుజా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లర్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారనే విషయం తెలిశాకే పనిలోంచి తీసేశారు అహుజా. అంతకు ముందు వారితో ఆమె భర్త సమీర్ అహుజా సైతం ఓసారి గొడవపెట్టుకున్నారు. దీంతో వారిపై పగ పెంచుకున్నాడు వ్యక్తి. తన గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సచిన్, సుజిత్‌ల హత్యకు ప్లాన్ చేశారు. మరో ఇద్దరి సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ కెమెరాల్లో నమోదైన వివరాల ప్రకారం.. ఐదుగురు రెండు బైకుల్లో ఉదయం 8 గంటల సమయంలో అహుజా ఇంటికి వచ్చారు. శాలూ అహుహా, ఆమె పని మనిషి స్వప్న మృత దేహాలు గ్రౌండ్ ఫ్లోర్లో లభించగా.. సమీర్ అహుజా మొదటి అంతస్తులో పడి ఉంది. ఆయన ముఖం, తలపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారి చిన్నారిని వారు గుర్తించకపోవటం వల్ల చంపలేదని పోలీసులు తెలిపారు. మహిళలిద్దరి గొంతు కోశారని, సమీర్ అహుజాను ప్యాన్‌తో కొట్టారని వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇదీ చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల హత్య.. ప్రతీకారంగానే!
తన సోదరి, ఆమె బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కసి పెంచుకున్న ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. రాజస్థాన్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో గ్రూపులలో వైరల్ అవుతోంది. అయితే ఇవి ప్రతీకారహత్యలేనని పోలీసులు చెప్తున్నారు. జైపూర్: నడిరోడ్డులో పట్టపగలు ఓ జంటను దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని సెంట్రల్ బస్టాండ్ సర్కిల్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు కారును అడ్డగించి.. అందులో ఉన్న జంటపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు బైక్‌పై ఉడాయించారు. మృతులను సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా గుర్తించిన పోలీసులు, వాళ్లు డాక్టర్లని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భరత్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతీకారంగానే.. కాగా, నిందితులను అనుజ్, మహేష్లుగా గుర్తించిన పోలీసులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నారు. డాక్టర్ సుదీప్‌కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని వాళ్లు నిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదు అయ్యింది. దీంతో 2019లో సుదీప్, అతని తల్లి, భార్య సీమాలు జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్. కాబట్టే ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తన ట్విట్టర్లో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి.. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించాడు. చదవండి: శాడిస్ట్ రేపిస్ట్.. శిక్ష ఎంతంటే.. -
కరీంనగర్లో ప్రతీకార హత్య
► కొడుకు హత్యకేసులో నిందితుడిని హతమార్చిన తండ్రి ► జైలు నుంచి వచ్చిన మూడు నెలలకే మట్టుపెట్టిన ప్రత్యర్థి ► తల్లి నెలమాసికానికి వచ్చి చిక్కిన వైనం కరీంనగర్: నక్సలైట్లు, పోలీసుల తనిఖీలు, ఎన్కౌంటర్లతో ఒకప్పుడు అట్టుడికిన అటవీ గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను తలపించేలా మంగళవారం ప్రతీకార హత్య జరిగింది. తన కొడుకును హత్య చేశాడనే కారణంలో హత్య కేసులో నిందితుడైన యువకుడిని తండ్రి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటనతో పల్లెలన్నీ ఉలిక్కిపడ్డాయి. సిరిసిల్ల రూరల్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..మద్దిమల్లకు చెందిన సంతోష్, వీర్నపల్లికి చెందిన పిట్ల గిరిబాబు మంచి స్నేహితులు. గతంలో ఇద్దరు కలిసి అనేక మందితో వివాహేతర సంబంధాలు నెరిపారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్ సిద్దిపేట, సిరిసిల్లకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి సిరిసిల్ల మానేరు వాగులో ఈ ఏడాది జనవరి 4న గిరిబాబు(24)ను హత్య చేశాడు. జనవరి 27న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. దీంతో సంతోష్‌పై గిరిబాబు తండ్రి అంజయ్య కక్ష పెంచుకున్నాడు. రెండునెలలు జైల్లో ఉన్న సంతోష్ మూడు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. సిరిసిల్లలో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నెలరోజులక్రితం సంతోష్ తల్లి లచ్చవ్వ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడు సంతోష్‌ను హతమార్చేందుకు అంజయ్య రెండుసార్లు విఫలయత్నం చేశాడు. సోమవారం తల్లి నెలమాసికం ఉండడంతో మద్దిమల్లకు వచ్చిన సంతోష్ రాత్రి కుటుంబసభ్యులతో ఇంట్లోనే ఉన్నాడు. 12:30 గంటల సమయంలో అంజయ్య, అతడి వియ్యంకుడు అబ్బనవేని శంకర్‌తో మద్దిమల్లకు వచ్చాడు. సంతోష్‌ను బయటకు తీసుకెళ్తుండగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. వారిని బెదిరించి సంతోష్‌ను మద్దిమల్ల-కంచర్ల శివారులోని వెంకట్రాయిని చెరువు వద్దకు తీసుకెళ్లారు. బట్టలు ఊడదీసిగొడ్డళ్లతో నరికి, బండరాళ్లతో మోది, కర్రలతో కొట్టి హత్యచేశారు. మంగళవారం వేకువ జామున మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు సిరిసిల్లకు వెళ్లాలని సూచించినా ఇక్కడే ఉండి హత్యకు గురయ్యాడని రోదించారు. సంతోష్‌కు భార్య సుమలత, మూడునెలల కుమారుడు అశ్విక్, తండ్రి నర్సయ్య ఉన్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు. సుమలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్, ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.