Rajasthan Doctor Couple Murder: Rajasthan Revenge Killing Video Goes Viral - Sakshi
Sakshi News home page

రాజస్థాన్​: పట్టపగలే కాల్పులు.. జంట హత్య

Published Sat, May 29 2021 11:17 AM | Last Updated on Sat, May 29 2021 12:20 PM

Rajasthan Doctor Couple Gun Shot In Day Light  - Sakshi

తన సోదరి, ఆమె బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కసి పెంచుకున్న ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. రాజస్థాన్​లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో గ్రూపులలో వైరల్ అవుతోంది. అయితే ఇవి ప్రతీకారహత్యలేనని పోలీసులు చెప్తున్నారు.
 
జైపూర్: నడిరోడ్డులో పట్టపగలు ఓ జంటను దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్​లో చోటు చేసుకుంది. భరత్​పూర్​ జిల్లా హెడ్​క్వార్టర్స్​లోని సెంట్రల్​ బస్టాండ్​ సర్కిల్​ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బైక్​పై వచ్చిన ఇద్దరు నిందితులు కారును అడ్డగించి.. అందులో ఉన్న జంటపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు బైక్​పై ఉడాయించారు. మృతులను సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా గుర్తించిన పోలీసులు, వాళ్లు డాక్టర్లని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భరత్​పూర్​ ఐజీ ప్రశాంత్​ కుమార్​ తెలిపారు.


ప్రతీకారంగానే..
కాగా, నిందితులను అనుజ్​, మహేష్​లుగా గుర్తించిన పోలీసులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నారు. డాక్టర్​ సుదీప్​కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని వాళ్లు నిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్​ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదు అయ్యింది. దీంతో 2019లో సుదీప్​, అతని తల్లి, భార్య సీమాలు జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్. కాబట్టే ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత రాజ్యవర్థన్​సింగ్​ రాథోడ్​ తన ట్విట్టర్​లో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్​ చేసి.. కాంగ్రెస్​ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించాడు.

చదవండి: శాడిస్ట్​ రేపిస్ట్​.. శిక్ష ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement