day light murder
-
నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల హత్య.. ప్రతీకారంగానే!
తన సోదరి, ఆమె బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కసి పెంచుకున్న ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. రాజస్థాన్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో గ్రూపులలో వైరల్ అవుతోంది. అయితే ఇవి ప్రతీకారహత్యలేనని పోలీసులు చెప్తున్నారు. జైపూర్: నడిరోడ్డులో పట్టపగలు ఓ జంటను దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని సెంట్రల్ బస్టాండ్ సర్కిల్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు కారును అడ్డగించి.. అందులో ఉన్న జంటపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు బైక్‌పై ఉడాయించారు. మృతులను సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా గుర్తించిన పోలీసులు, వాళ్లు డాక్టర్లని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భరత్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతీకారంగానే.. కాగా, నిందితులను అనుజ్, మహేష్లుగా గుర్తించిన పోలీసులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నారు. డాక్టర్ సుదీప్‌కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని వాళ్లు నిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదు అయ్యింది. దీంతో 2019లో సుదీప్, అతని తల్లి, భార్య సీమాలు జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్. కాబట్టే ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తన ట్విట్టర్లో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి.. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించాడు. చదవండి: శాడిస్ట్ రేపిస్ట్.. శిక్ష ఎంతంటే.. -
నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో
ఫరీదాబాద్ : మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా హరియాణలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన వైనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నిఖిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నిఖితను కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. నిఖిత పరీక్ష రాసి బయటికి వస్తుండగా బాధితురాలి స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ ఎటాక్ చేశాడు. మొదట కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిఖిత కిడ్నాప్ యత్నం, ఆమె ప్రతిఘటన, కారులోంచి దిగిన నిందితుడు తన రివాల్వర్‌ను బయటకు తీసి కాల్పులు జరపడం, బాధితురాలు కుప్పకూలిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. హరియాణలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై భారీ ఆగ్రహం చెలరేగింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. फरीदाबाद, छात्रा का अपहरण करने का प्रयास, असफल होने पर गोली मारकर हत्या। भाजपा शासित राज्यों में महिलाओं की स्थिति दयनीय है भले हरियाणा हो या यूपी, एमपी pic.twitter.com/ZHqmukqm8n — KARAN THAPAR DESI (@DesiStupides) October 27, 2020 -
ఢిల్లీ నడిబొడ్డున దారుణ హత్య
-
ఢిల్లీ నడిబొడ్డున దారుణ హత్య
⇒ టీచర్ని 22 సార్లు కత్తెరతో పొడిచిన వైనం ⇒ ఉదయం 9 గంటలకు అంతా చూస్తుండగానే ఘోరం ⇒ విలవిల్లాడుతూ అక్కడే ప్రాణాలు విడిచిన యువతి ⇒ దాడికి పాల్పడింది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు ⇒ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు న్యూఢిల్లీ: మూడు నెలల కిందట.. చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ యువతిని ఉన్మాది కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడు! నేడు.. దేశ రాజధాని.. ఉదయంపూట.. మరో ఘోరం! ఓ రాక్షసుడు అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశాడు!! వెంట తెచ్చుకున్న కత్తెరతో రెండున్నర నిమిషాల్లో ఏకంగా 22 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. వాడు అలా దాడి చేస్తున్న సమయంలో చుట్టూరా జనం ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వారిలో ఒక్కరు ధైర్యం చేసినా ఆ అమ్మాయి బతికేదేమో పాపం!! ఆ ఉన్మాది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు కావడం గమనార్హం. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో క్లిప్ మీడియా, సోషల్ మీడియాలో విసృ్తతంగా ప్రచారం కావడంతో కేంద్రం కదిలింది. ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది. అసలేం జరిగింది? ఆమె పేరు కరుణ కుమార్. వయసు 21 సంవత్సరాలు. ఢిల్లీలోని నావెల్ రిచెస్ స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తోంది. వరుసకు సోదరైన నేహా కూడా అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎప్పట్లాగే ఇద్దరూ కలసి పాఠశాలకు బయల్దేరారు. నార్త్ ఢిల్లీలోని బురారీలో లేబర్చౌక్కు చేరుకున్నారు. ఉన్మాది సురేందర్(34) మరో వ్యక్తితో కలసి బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కరుణపై విరుచుకుపడ్డాడు. కిందకు తోసేసి కత్తెరతో విచక్షణరహితంగా పొడిచాడు. కరుణ విలవిల్లాడుతూ సాయం కోసం అర్థించింది. ఆ సమయంలో ఓ వ్యక్తి సురేందర్‌ను ఆపేందుకు కొద్దిగా ముందుకు వచ్చాడు. కానీ తనపైనా దాడి చేస్తాడేమోనన్న భయంతో వెనక్కి తగ్గాడు. వెంట ఉన్న నేహాను ఉన్మాది కత్తెరతో బెదిరించడంతో పక్కన నిలబడి గట్టిగా కేకలు పెట్టింది. రెండున్నర నిమిషాల వ్యవధిలో ఆ ఉన్మాది... కరుణ ముఖం, గొంతు, గుండెపై 22 సార్లు పొడిచి పారిపోయాడు. తర్వాత అక్కడున్నవారు ఆమెను సివిల్‌లైన్స్‌లోని శుశ్రుత హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సరైన వివరాలు చెప్పడం లేదంటూ కరుణ కుటుంబీకులు ఆసుపత్రి ముందు గంటసేపు ధర్నాకు దిగారు. అదనపు డీసీపీ ఈశా పాండే వచ్చి వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు. పట్టుకొని చితకబాదిన స్థానికులు కరుణను చంపి పారిపోతున్న సురేందర్‌ను కొద్దిదూరంలో స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడి తలకు తీవ్ర గాయం కావడంతో తొలుత అరుణ అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత అక్కడ్నుంచి ఎల్ఎన్జేపీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 320 (హత్య) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు సురేందర్ ఢిల్లీలో ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు. ఇతడికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. గత ఏడాదిన్నర నుంచి కరుణ వెంట పడుతున్నాడు. దీంతో ఆమె కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలో సురేందర్‌కు చెందిన కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కరుణ ట్రెయినింగ్ తీసుకుంది. అప్పట్నుంచే సురేందర్ తనను ప్రేమించాలంటూ కరుణను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు ఆగ్రాలో సమీప బంధువు ఒకరు చనిపోవడంతో కరుణ తల్లిదండ్రులు ఆగ్రా వెళ్లి మంగళ వారం ఉదయమే ఢిల్లీకి తిరిగి వచ్చారు. వచ్చీరాగానే కరుణ మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా బంధువు చనిపోవడంతో భర్తతో కలసి ఆగ్రా వెళ్లాం. ఉదయమే వచ్చాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నా బిడ్డ ఎంతో కష్టపడేది. నెలకిందటే ఆ స్కూల్లో టీచర్‌గా చేరింది. ఇంకా పై చదువులు చద వాలనుకుంటోంది’’ అంటూ కరుణ తల్లి రామ్ బేటీ గుండెలవిసేలా విలపించింది. ఆమె తండ్రి నరేశ్‌కు సంత్‌నగర్‌లో ఓ చిన్న బ్యాగుల షాపు ఉంది. దాంతో నెలకు వచ్చే రూ.10 వేలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దూరవిద్య ద్వారా బీఏ పూర్తి చేసిన కరుణ.. టీచర్‌గా వస్తున్న రూ.5 వేల జీతంతో తన తండ్రికి అండగా నిలిచింది. తన ఇద్దరు సోదరులు మనీశ్, హిమాన్షులను చదివిస్తోంది. ‘‘సురేందర్ మా అక్కను వేధించడంతో మేం గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అతడి తల్లిదండ్రులు వచ్చి క్షమాపణలు చెప్పారు. రాజీ కుదిరింది. ఇంతలోనే ఇలా చంపేశాడు’’ అని మనీశ్ తెలిపాడు. ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నాం.. కరుణ, తాను ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నామని సురేందర్ పోలీసులకు తెలిపాడు. పెళ్లి ప్రతిపాదనను ఆమె కుటుంబం తిరస్కరించిందని, మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని వివరించారు. ‘‘కరుణ మరో వ్యక్తితో కలసి ఉన్న ఫొటోను ఓ వ్యక్తి సురేందర్‌కు ఫోన్లో పంపాడు. దాంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. దాడి సమయంలో సురేందర్‌తోపాటు బైక్ వచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య
-
పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య
పట్టపగలు అందరూ చూస్తుండగానే దేశ రాజధానిలో ఓ మహిళను ఓ వ్యక్తి 22 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్‌గా పనిచేసేది. 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను తరచు వెంటాడి, వేధిస్తుండేవాడు. అతడే ఆమెను మంగళవారం ఉదయం 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చేయించారు తప్ప ఎలాంటి చర్య తీసుకోలేదు. సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా.. అక్కడ కేసు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.