
పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య
పట్టపగలు అందరూ చూస్తుండగానే దేశ రాజధానిలో ఓ మహిళను ఓ వ్యక్తి 22 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్‌గా పనిచేసేది. 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను తరచు వెంటాడి, వేధిస్తుండేవాడు.
అతడే ఆమెను మంగళవారం ఉదయం 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చేయించారు తప్ప ఎలాంటి చర్య తీసుకోలేదు. సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా.. అక్కడ కేసు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.