పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..! | Revenge Murder A Couple And Their Domestic Help Murdered In Delhi | Sakshi
Sakshi News home page

పనిలోంచి తీసేశారని యజమాని కుటుంబాన్నే కడతేర్చిన లవర్స్‌

Published Wed, Nov 2 2022 2:42 PM | Last Updated on Wed, Nov 2 2022 2:44 PM

Revenge Murder A Couple And Their Domestic Help Murdered In Delhi - Sakshi

న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట ప్రేమ వ్యవహారం నడిపించారు. అది తెలిసిన యజమానికి పని లోంచి తొలగించాడని కక్ష పెంచుకున్నారు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు. యజమాని దంపతులతో పాటు పని మనిషిని సైతం దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంగానే పగ పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల చిన్న పాప ఇంట్లో నిద్రపోతున్న నేపథ్యంలో చిన్నారిని గమనించలేదని చెప్పారు.

ఏం జరిగింది?
తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో శాలు అహుజా బ్యూటీ పార్లర్‌ నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లర్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారనే విషయం తెలిశాకే పనిలోంచి తీసేశారు అహుజా. అంతకు ముందు వారితో ఆమె భర్త సమీర్‌ అహుజా సైతం ఓసారి గొడవపెట్టుకున్నారు. దీంతో వారిపై పగ పెంచుకున్నాడు వ్యక్తి. తన గర్ల్‌ ఫ్రెండ్‌తో పాటు  మరో ఇద్దరు స్నేహితులు సచిన్‌, సుజిత్‌ల హత్యకు ప్లాన్‌ చేశారు. మరో ఇద్దరి సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సెక్యూరిటీ కెమెరాల్లో నమోదైన వివరాల ప్రకారం.. ఐదుగురు రెండు బైకుల్లో ఉదయం 8 గంటల సమయంలో అహుజా ఇంటికి వచ్చారు. శాలూ అహుహా, ఆమె పని మనిషి స్వప్న మృత దేహాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లభించగా.. సమీర్‌ అహుజా మొదటి అంతస్తులో పడి ఉంది. ఆయన ముఖం, తలపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారి చిన్నారిని వారు గుర్తించకపోవటం వల్ల చంపలేదని పోలీసులు తెలిపారు. మహిళలిద్దరి గొంతు కోశారని, సమీర్‌ అహుజాను ప్యాన్‌తో కొట్టారని వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.

ఇదీ చదవండి: యాపిల్‌ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement