delhi murder
-
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రియుడే ప్రేయసిని ముక్కముక్కలుగా చేసిన ఢిల్లీ మెహ్రౌలీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగిన దాదాపు ఆరు నెలల అనంతరం నిందితుడు అఫ్తాబ్ ఆమిన్ పూనావాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణ ఎలా జరిగింది? ఒక్క అబద్ద అఫ్తాబ్‌ను ఎలా పట్టించిందనే విషయాలను పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ► ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన అనంతరం తనపై అనుమానం రాకుండా.. ఆమె ఇన్స్టాగ్రాం అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్‌తో ఇఫ్తాబ్ చాట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తే శ్రద్ధ చనిపోయిందని ఆమె స్నేహితులకు అనుమానం రాదని అతను భావించాడని చెప్పారు. అంతేకాదు మొబైల్ యాప్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు కూడా చేశాడని వివరించారు. ► శ్రద్ధ కన్పించడం లేదని ఆమె తండ్రి ముంబై వాసాయ్ పోలీస్ స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న పోలీసులు అఫ్తాబ్‌ను విచారణకు పిలిచారు. అయితే శ్రద్ధ మే 22నే ఢిల్లీ మెహ్రౌలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్లిపోయిందని అఫ్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులు ఫ్లాట్‌లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే(మే 18) ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరూ ఢిల్లీ మెహ్రౌలీ ఫ్లాట్‌కు మారి రెండు వారాలే అయింది. ► అయితే అఫ్తాబ్‌ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రౌలీలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు శ్రద్ధ ఖాతా నుంచి అఫ్తాబ్‌కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ► దీంతో పోలీసులకు అఫ్తాబ్‌పై మరోసారి అనుమానం వచ్చింది. వెంటనే అతడ్ని మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా తానే కడతానని, ఆమె పాస్వర్డ్లు, ఖాతా వివరాలు తనకు తెలుసునని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. తానే యాప్ ద్వారా శ్రద్ధ ఖాతా నుంచి తన ఖాతాలోకి డబ్బు పంపించుకున్నట్లు వివరించాడు. ► అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రాం చాట్‌ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్‌తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మొహ్రౌలీలోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మే 22నే వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రౌలీలోనే ఎలా ఉందని ప్రశ్నించారు. ► అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అఫ్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు భయానక నిజాన్ని చెప్పాడు. ఒక్కో పార్ట్‌ను ఒక్కోరోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. ► శ్రద్ధ తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి ఆగ్రహంతో ఆమెకు దూరంగా ఉన్నారు. ఎక్కడుంది? ఎలా ఉంది? అనే బాగోగులు పట్టించుకోలేదు. అయితే గత నెలలో ఆమె స్నేహితులకు కూడా శ్రద్ధ టచ్‌లో లేదని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అసలు విషయం వెలుగుచూసింది. ► శ్రద్ధ, అఫ్తాబ్ ఇద్దరూ ముంబై వాసాయ్ ప్రాంతానికి చెందినవారే. 2019లో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏదాది మే లోనే ఢిల్లీకి మకాం మార్చారు. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ సమయంలో వేరే అమ్మాయిలను కూడా ఫ్లాట్‌కు పిలిచి డేటింగ్ చేశాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో.. -
అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్‌బేడీ తెలిపారు. శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్‌బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్‌లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె. సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్! -
పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..!
న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట ప్రేమ వ్యవహారం నడిపించారు. అది తెలిసిన యజమానికి పని లోంచి తొలగించాడని కక్ష పెంచుకున్నారు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు. యజమాని దంపతులతో పాటు పని మనిషిని సైతం దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంగానే పగ పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల చిన్న పాప ఇంట్లో నిద్రపోతున్న నేపథ్యంలో చిన్నారిని గమనించలేదని చెప్పారు. ఏం జరిగింది? తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో శాలు అహుజా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లర్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారనే విషయం తెలిశాకే పనిలోంచి తీసేశారు అహుజా. అంతకు ముందు వారితో ఆమె భర్త సమీర్ అహుజా సైతం ఓసారి గొడవపెట్టుకున్నారు. దీంతో వారిపై పగ పెంచుకున్నాడు వ్యక్తి. తన గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సచిన్, సుజిత్‌ల హత్యకు ప్లాన్ చేశారు. మరో ఇద్దరి సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ కెమెరాల్లో నమోదైన వివరాల ప్రకారం.. ఐదుగురు రెండు బైకుల్లో ఉదయం 8 గంటల సమయంలో అహుజా ఇంటికి వచ్చారు. శాలూ అహుహా, ఆమె పని మనిషి స్వప్న మృత దేహాలు గ్రౌండ్ ఫ్లోర్లో లభించగా.. సమీర్ అహుజా మొదటి అంతస్తులో పడి ఉంది. ఆయన ముఖం, తలపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారి చిన్నారిని వారు గుర్తించకపోవటం వల్ల చంపలేదని పోలీసులు తెలిపారు. మహిళలిద్దరి గొంతు కోశారని, సమీర్ అహుజాను ప్యాన్‌తో కొట్టారని వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇదీ చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
దారుణం: సోదరిపై వేధింపులను ప్రశ్నించాడని కత్తులతో పొడిచి చంపేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరిపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రశ్నించినందుకు ఓ 17 ఏళ్ల బాలుడిని దారుణంగా పొడించి చంపేశారు ఇద్దరు మైనర్లు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు పటేల్ నగర్‌కు చెందిన బాలుడిగా గుర్తించారు. వీడియో ప్రకారం.. ఓ గల్లీలో ముగ్గురు మైనర్లు గొడవ పడుతున్నారు. అందులో ఒకడు బాధితుడిని కత్తితో పలు మార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. శరీరంలో దిగిన కత్తితో బాధితుడు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయే ముందు తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసేందుకు ప్రయత్నించినట్ల తెలుస్తోంది. కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంటివద్దే దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. #Video: #Delhi Teen Stabbed To #Death After He Protested Sister's #Harassment. @DelhiPolice #PatelNagar #viral #murder #CCTV #news #UnMuteIndia #crime Subscribe to our YouTube page: https://t.co/EKkVQVGoS5 pic.twitter.com/sz4Q5XU8jD — UnMuteINDIA (@LetsUnMuteIndia) October 29, 2022 ఇదీ చదవండి: ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్.. చివరకు.. -
దారుణం.. స్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేసిన విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశారు తోటి విద్యార్థులు. గాల్గోటియాస్ ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి మృతదేహం గ్రేటర్ నోయిడాలోని ఇన్స్టిట్యూట్కు సమీపంలోని డ్రైనేజీలో లభించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని హత్య చేసిన వారిలో ఐదుగురు విద్యార్థులను గుర్తించినట్లు చెప్పారు. మృతుడు యశశ్వి రాజ్‌గా గుర్తించినట్లు చెప్పారు పోలీసులు. మరోవైపు.. ఐదుగురు విద్యార్థులు గొడవ పెట్టుకుని యశశ్విని దారుణంగా కొట్టి చంపేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
పిల్లాడిని చంపి నెలరోజులు సూట్‌కేసులోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు సంవత్సరాల బాలుడిని చంపి... నెల రోజుల పాటు సూట్‌కేసులోనే దాచిన ఘటన నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని స్వరూప్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అవదేశ్ శాక్య(27) అనే యువకుడు తాను అద్దెకున్న ఇంట్లోని ఆశీస్(7) అనే బాలుడిని జనవరి 6న హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నెలరోజుల పాటు సూట్‌కేసులోనే దాచి పెట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని ఆశీష్ తండ్రి కరణ్ సింగ్ స్వరూప్‌నగర్ పోలీసుస్టేషన్లో జనవరి 6న ఫిర్యాదు దాఖలు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు, ఇంట్లో అద్దెకున్న అవదేశే ఈ హత్య చేసినట్టు తేల్చారు. ఆశీష్ తల్లిదండ్రులు అవదేశ్‌తో మాట్లాడవద్దని చెప్పేవారని, దానితో వారిపై కసితో అవదేశ్ ఈ అకృత్యానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అవదేశ్‌ను అతని ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టు నార్త్‌వెస్ట్ డీసీపీ అస్లమ్ ఖాన్ చెప్పారు. బాలుడి మృతదేహాన్ని ఎక్కడైనా పారేసి, డబ్బు కోసం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనుకుంటున్నట్టు అవదేశ్ పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. మూడు సంవత్సరాలు కరణ్ ఇంట్లో అద్దెకు... అవదేశ్ యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు చెప్పారు. అతను మూడు సంవత్సరాలుగా కరణ్ సింగ్ ఇంట్లో అద్దెకు ఉన్నాడని, ఈ మూడు సంవత్సరాల కాలంలో కరణ్ సింగ్, అతని కుటుంబసభ్యులకు అవదేశ్ సన్నిహితుడయ్యాడని తెలిపారు. కొన్ని నెలల కిందట అవదేశ్ ఇల్లు ఖాళీ చేసి అదే ప్రాంతంలో ఉన్న మరో ఇంటికి మారాడని వారు చెప్పారు. ఇల్లు మారిన తర్వాత కూడా కరణ్ సింగ్ ఇంటికి అవదేశ్ వచ్చి పోతుండేవాడు. అయితే కరణ్ సింగ్ తన కొడుకును అవదేశ్‌తో కలవనిచ్చేవాడు కాదని పోలీసు అధికారి చెప్పారు. జనవరి 6న అశీష్, అవదేశ్ ఇంటికి వచ్చి తన తండ్రి అతనితో మాట్లాడవద్దని చెప్పాడని తెలిపాడు. దీంతో అవదేశ్ ఒళ్లు తెలియని ఆగ్రహంతో ఆశీష్‌ను మప్లర్‌తో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టాడు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల పక్కనే... ఆశీష్‌ను చంపిన తరువాత కూడా అవదేశ్ ఏమీ తెలియని వాడిలా కరణ్ సింగ్ ఇంటికి రాకపోకలు సాగించాడు. తన కొడుకు కనిపించకుండా పోయాడని కరణ్ సింగ్ పోలీసుకలకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూడా అతని వెంట అవదేశ్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా.. దాని గురించి అడిగిన పొరుగు వారికి ఇంట్లో ఎలుకలు చ్చాయని అతను బుకాయించాడు. ఆశీష్ కోసం గాలిస్తూ పోలీసులు ఆ ప్రాంతలో నిరంతరం తచ్చాడుతుండటంతో తాను మృతదేహాన్ని మరో చోటికి తీసుకెళ్లి పారేయలేకపోయాయని అవదేశ్ అంగీకరించాడు. అవదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, అతను సివిల్ సర్వీసు పరీక్షలు రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను మూడు సార్లు ప్రిలిమినరీ, రెండు సార్లు మెయిన్స్ పరీక్షలు రాశాడని పోలీసులు తెలిపారు. -
పానీపూరీ ఇవ్వలేదని.. పొడిచి చంపేశారు!
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఔటర్ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో పానీపూరీ అమ్ముకునే వ్యక్తిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు బాలనేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా బాగా తాగేసి ఉన్నారు. వాళ్లకు అర్ధరాత్రి సమయంలో పానీపూరీ ఇచ్చేందుకు రాజు (24) నిరాకరించడంతో వాళ్లు అతడిని 18 సార్లు కత్తితో పొడిచారు. హత్యలో తమ పాత్ర ఉన్నట్లు ఈ ఐదుగురూ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గోగి (22), అనిల్ (28), నిఖిల్ (24) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. రాజు తన కుటుంబంతో కలిసి మంగోల్‌పురి బ్లాక్ 1లో నివసించేవాడు. రోడ్డు పక్కన తన తండ్రి రాధేశ్యామ్‌తో కలిసి పానీపూరీ, ఇతర స్నాక్స్ అమ్మేవాడు. రాత్రి 11.30 గంటల సమయంలో అతడు తన షాపు కట్టేసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతడి తండ్రి కాస్త ముందు వెళ్తూ దాదాపు ఇంటికి చేరుకున్నాడు. అంతలో ఐదుగురు వ్యక్తులు మద్యం తాగుతూ రాజును ఆపి పానీపూరీ అడిగారు. అయితే సరుకులు అయిపోయాయని, ఇప్పుడు ఇవ్వలేనని రాజు చెప్పాడు. అయినా సరే తమకు కావల్సిందేనని వాళ్లు పట్టుబట్టారు. రాజు నిరాకరించడంతో వాళ్లలో ఒకడు కత్తితీసి రాజు పడిపోయేవరకు పొడిచాడు. అతడి అరుపులు విన్న తండ్రి, ఇరుగు పొరుగువారు అక్కడకు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. వాళ్లలో ఇద్దరిని పట్టుకున్నారు. రాజును సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గోగి, అనిల్ ఇద్దరికీ గతంలో నేరచరిత్ర ఉంది. నిఖిల్‌కు నేరచరిత్ర లేదు గానీ, అలాంటివాళ్లతో కలిసి తిరిగేవాడు.