హైదరాబాద్:కాచిగూడలోని నింబోలి అడ్డాలో ఉన్న సిలిండర్ గోడౌన్ లోశనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ గోడౌన్ లో ఆకస్మికంగా మంటలు ఏర్పడటంతో ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి తెలుసుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సంఘటనా స్థల పరిశీలనకు వెళ్లిగా ఆయనకు తృటిలో ముప్పు తప్పింది. కిషన్ రెడ్డి ముందే ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.