=సిలిండర్‌పై అదనపు చార్జీ రూ. 66.50
=షాకిచ్చిన చమురు సంస్థలు
సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సరం వంటిం టికీ మోయలేని భారాన్ని మోసుకొచ్చింది. చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధరను ఒకేసారి రూ.215లు పెంచి షాకిచ్చాయి. పెరిగిన ధరతో గ్యాస్ బండ ధర రూ.1327.50 లకు చేరింది. ప్రత్య క్ష ప్రయోజన బదిలీ (నగదు బదిలీ) పథకం ప్రారంభించిన నాటి నుంచి ఎల్పీజీ మార్కెట్ ధరను పరిశీలిస్తే ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటి సారి. అప్పట్లో మార్కెట్‌లో సిలిండర్ ధర రూ. 965లు ఉండగా గత ఆరు మాసాల్లోనే అదనంగా రూ. 362.50 వరకు పెరిగింది. అయితే పెరి గిన ధరను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నప్పటికీ ట్యాక్సుల రూపేణా బండపై అదనంగా రూ. 66.50 వసూలు చేస్తోంది. ఫలితంగా ‘గ్రేటర్’పై నెలన్నరకు (ఒక సిలిండర్ నెల న్నర వస్తుంది అనుకుంటే) రూ.12.80 కోట్ల భారం.. ఏడాదికి రూ.102.4 కోట్ల వరకు భారం పడుతుంది.
బాదుడు ఇలా..
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం వినియోగంలో సుమారు 28.29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 19.26 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. నగదు బదిలీ పథకం పరిధి కింద వచ్చిన వారికి తాజాగా పెరిగిన ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా రూ.845ల నగదు బ్యాంక్ ఖాతాకు అందిస్తుంది. డీబీటీ అమలు లేని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మాత్రం సిలిండర్ రీఫిల్లింగ్ రూ.416 లకు మాత్రమే లభిస్తోంది. డీబీటీ పథకం వల్ల వచ్చిన సబ్సిడీ సొమ్ము కలుపుకొన్నా నగరవాసులు సిలిండర్‌పై రూ.66.50 అదనంగా భరించక తప్పడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై అందించిన సబ్సిడీ రూ.25 లకు ఎగనామం పెట్టడమే కాకుండా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో 41.50లను ముక్కుపిండి వసూలు చేస్తోంది.
మార్కెట్‌ధర మరింత భారం
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్‌కు డీబీటీ వర్తించని వినియోగదారులపై మార్కెట్ ధరతో నెలన్నరకు రూ.82.30 కోట్ల చొప్పున భారం పడనుంది. ఈ లెక్కనా ఏడాదికి 658.4కోట్ల భారం భరించాల్సి ఉంటు ంది. ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి దూరం గా సుమారు 9.03 లక్షల మంది వినియోగదారులు ప్రస్తుత మార్కెట్ ధర చెల్లించి వంటగ్యాస్‌ను కొనుగోలు చేయక తప్పదు. మిగతా జిల్లాల్లో డీబీటీ అమలు లేకుంటే సిలిండర్ రీఫిల్లింగ్ రూ.416లకు లభిస్తోంది. ఇక్కడ మాత్రం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.1327.50 పైసలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీబీటీ వర్తించని కారణంగా కేంద్రప్రభుత్వం అందించే రూ. 845ల సబ్సిడీ సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టిన సబ్సిడీ, వ్యాట్ పన్నులు రూ.66.50 కలుపుకొని మొత్తం రూ. 911.50 అదనంగా భరించక తప్పడం లేదు.
‘గ్రేటర్’పై ఏటా బండ భారం రూ.102 కోట్లు
Published Thu, Jan 2 2014 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement