
పెరిగిన సబ్సిడీ సిలిండర్ ధర
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన రెండోరోజే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్పై రూ.1.93 పెంచారు. సబ్సిడీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో 421.16గా ఉండగా, తాజా పెంపుతో అది 423.09కి పెరిగింది. కాగా గత నెలలోనే సబ్సిడీ సిలిండర్ పై 1.98 పైసలు విషయం తెలిసిందే. తాజాగా నెలరోజుల వ్యవధిలోనే కేంద్రం మరోమారు ధర పెంచింది.
కాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 1.42, డీజిల్‌పై రూ.2.01 మేర దిగివచ్చాయి. నెలరోజుల్లో ఇది మూడో తగ్గింపు. తాజా ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.