రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిన్ తయారు చేస్తుండగా సిలిండర్ పేలిన సంఘటన మంగళవారం నార్సింగిలో జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. క్లూస్ టీం రంగంలోకి దిగి ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.