
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బోరజ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో సిలెండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా హోటల్ అంతా మంటలు వ్యాపించాయి. కాగా, అప్రమత్తమైన హోటల్ యజమాని వెంటనే బయటకు పరుగులు తీశాడు. హోటల్‌లో కస్టమర్‌లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
హోటల్ సిబ్బంది డ్రమ్‌లోని నీళ్లతో మంటలను ఆర్పుతున్నారు. తమకు రోజు అన్నంపెట్టే హోటల్ అగ్నిప్రమాదానికి గురవ్వడం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment