
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే..
అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు.
వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు.
అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్‌లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు.
Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ
— Science (@ScienceGuys_) March 1, 2024