కందుకూరు (రంగారెడ్డి జిల్లా): వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో వస్తువులు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని లేమూరు పరిధిలో దన్నారం రవీందర్ ఇంట్లో ఆయన భార్య శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో వంట చేయడానికి లైటర్‌తో గ్యాస్ స్టవ్‌ను వెలిగించే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వారు బయటకు పరుగెత్తారు. భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. కాగా, గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పి సిలిండర్ నుంచి రెగ్యులేటర్‌ను తొలగించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
సిలిండర్ లీకేజీతో మంటలు
Published Fri, Jul 3 2015 11:06 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement