సిలెండర్ పేలుడుకు ధ్వంసమైన వంటగదిని పరిశీలిస్తున్న ఎంఈఓ
గంట్యాడ: పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో భవనం కుప్పకూలింది. సంఘటన సమయంలో పరిసర ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని రామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాఠశాల నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. పేలుడు శబ్ధానికి పరిసర నివాసితులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాఠశాల వంటగది నుంచి పొగలు రావడంతో అక్కడకు చేరుకున్నారు.
భవనంలో నుంచి మంటలు రావడంతో స్కూల్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. హెచ్‌ఎం ఎంఈఓకు సమాచారం ఇవ్వగా ఆమె 101 ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిం ది. ప్రమాదంలో భవనం పూర్తిగా కూలి పోయింది. పాఠశాలకు ఒంటి పూట బడులు కావడం, సాయంత్రం ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్ర మాద వివరాలను ఉన్నతాధికారులకు తె లియజేస్తామని ఎంఈఓ జి.విజయలక్ష్మి తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలి యరాలేదు. ప్రమాదంలో గుడ్లు, వంట సామగ్రి, వంటపాత్రలు ధ్వంసమయ్యా యి. సిలెండర్ తునాతునకలైంది. విజయనగరం అగ్నిమాపక సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment