
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే.. ఎల్‌పీజీ గ్యాస్ ధరలను ప్రకటించాయి. అయితే ఈ సారి కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా రూ. 6 పెంచింది. యూనియన్ బడ్జెట్ తరువాత గ్యాస్ ధరలు పెరగడం ఇది మొదటిసారి.
ఈ రోజు (మార్చి 1) నుంచి 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర 1,803 రూపాయలు. ధరల పెరుగుదలకు ముందు దీని రేటు రూ. 1797 వద్ద ఉండేది. అయితే 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు
ఢిల్లీ: రూ. 1803
కోల్‌కతా: రూ. 1913
ముంబై: రూ. 1755
చెన్నై: రూ. 1965
14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు
ఢిల్లీ: రూ. 803
కోల్‌కతా: రూ. 829
ముంబై: రూ. 802.50
చెన్నై: రూ. 818.50
స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం కారణంగా LPG ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థల ఇన్‌పుట్ ఖర్చును పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ భారం వినియోగదారులపై పడుతుంది.
ఇదీ చదవండి: అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!