gas cyllinders
-
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 1న పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.1,155 చేరింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు, నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి చేరింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1052 నుంచి రూ.1102.5కి పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1079 నుంచి రూ.1129కి పెరిగింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1068.50 నుంచి రూ.1118.5కి చేరింది. -
కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ వెయిటేజీ నుంచి డెలివరీ వరకు ఇలా అన్నీ రకాల విభాగాల సమాచారం వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇటీవల కాలంలో గ్యాస్ కంపెనీలపై వినియోగదారులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాస్ సంస్థలు ప్రకటించినట్లుగా కాకుండా తమకు 1 నుంచి 2 కేజీల గ్యాస్ తగ్గుతుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ డెలివరీ టైంకు రావడం లేదనే’ ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ గ్యాస్ ఏ ఏజెన్సీ నుండి డెలివరీ అవుతుంది. సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?. సిలిండర్‌లో ఎన్ని కేజీల గ్యాస్ ఉంది. ఎప్పుడు, ఏ తేదీన డెలివరీ అవుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా క్యూఆర్‌కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా..దొంగిలిస్తున్న గ్యాస్‌తో పాటు సిలిండర్ భద్రత, ఇతర గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించ వచ్చని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తి కానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో పాటు కొత్త సిలిండర్లకు క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్‌ను అమర్చనున్నట్లు వెల్లడించారు. Fueling Traceability! A remarkable innovation - this QR Code will be pasted on existing cylinders & welded on new ones - when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K — Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022 -
బంజారాహిల్స్ : ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ అంబేద్కర్‌నగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చదవండి : (పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం) (శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం ) -
కట్టెల పొయ్యిలతోనే కాలుష్యం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యిలు ఎక్కువ వాడుతారనే విషయం తెల్సిందే. ఈ పొయ్యిల వల్ల ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడంలో భాగంగా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్‌లను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పేదల ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షన్’ తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ల కోసం నెలకు ఐదారు వందలు పెట్టాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యిలోకి కట్టెలు ఉచితంగా దొరకడం వల్ల ఆ పథకం అంతగా విజయవంతం కాలేదు. కట్టెల పొయ్యిల వల్ల ఎంత వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాతావరణంలోని ‘పీఎం–2.5’ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పీఎం–2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ (నలుసులు లేదా రేణువులు) 2.5 సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉండడం. ఇవి రోజుకు ఒక్క ఇంటి పొయ్యి నుంచి వెలువడుతాయంటే ఓ ట్రక్కు రోజంతా తిరిగితే వెలువడే రేణువులకన్నా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న కట్టెల పొయ్యిలన్నింటికి 2022 నాటికి స్వస్తి చెప్పాలన్నది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సు నిర్మాణం. ఈ దిశగా లండన్ ఇప్పటికే చర్యలు పట్టింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 17 లక్షల మంది కట్టెల పొయ్యిలను ఇప్పటికీ వాడుతున్నారు. వారు వంటకోసం కాకుండా రూమును వెచ్చబరచడం కోసమే ఎక్కువగా వాడుతారు. ఇప్పుడవి రకారకాల డిజైన్లలో వస్తుండడంతో వాటి పట్ల లండన్ వాసులకు ఆకర్షణ కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ రూమ్ ఈటర్ల కన్నా ఈ కాచుకొనే కట్టెల పొయ్యిలను వాడడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదవడమే కాకుండా ఆకర్షణీయంగా ఉండడం కారణం. భారత్‌లోని కట్టెల పొయ్యిల కన్నా లండన్ వాసుల పొయ్యిల ద్వారా తక్కువ కాలుష్యమే ఏర్పడుతుంది. అయినా వారికి అదే ఎక్కువట. మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో కలుగుతున్న కాలుష్యంలో వారి కట్టెల పొయ్యిల వల్ల వెలువడుతున్న కాలుష్యం దాదాపు 30 శాతం అట. భారత కట్టెల పొయ్యిల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడగానికి కారణం ఏ కట్టెలు దొరికితే అవే వాడేయడం, కొన్నిసార్తు పచ్చి కట్టలు కూడా వాడడం. లండన్ వాసులు ప్రత్యేక దుంగలను వాడుతారు. చిన్న చిన్న దుంగలను, పూర్తిగా ఎండిన దుంగలను, అవి కొన్ని ప్రత్యేక రకాలకు చెందిన దుంగలను మాత్రమే వాడాలంటూ అక్కడి ప్రభుత్వం వారికి మార్గదర్శకాలను నిర్దేశించింది. పొయ్యిల నుంచి ఎక్కువ పొగ రాకుండా ఎక్కువ మంట వచ్చే విధంగా పొయ్యిల నిర్మాణం ఉండాలంటూ వాటిని తయారు చేసే కంపెనీలకు కూడా మార్గదర్శకాలను సూచించింది. ఈ మేరకు ఇప్పుడు అక్కడి మార్కెట్లోకి ఐదు కిలోవాట్ల ‘సిల్వర్ డలే 5 ఎస్ఈ’ వుడ్ బర్కింగా స్టవ్ వచ్చింది. దాని ధరం 525 పౌండ్లు (దాదాపు 48 వేలు). అలాగే ‘బెల్టనే మిడ్‌ఫోర్డ్ ఎస్సీ’ వుడ్ బర్నింగ్ స్టవ్ వచ్చింది. దాని ధర 946 పౌండ్లు (86 వేలు). -
గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు
గ్యాస్ సరఫరాకు ఆధార్ కార్డులతో లింకు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని, ఆధార్ కార్డులతో సంబంధం లేకుండానే గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ కార్డుల కోసం ఒత్తిడి చేయడం సరికాదని, వినియోగదారులకు ఆ కార్డులు లేకపోయినా కూడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతో ఆధార్ కార్డులను గ్యాస్ సరఫరాకు లింకు చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకం పుణ్యమాని వినియోగదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సిలిండర్ కొన్న ధరకు, సబ్సిడీ సిలిండర్ ధరకు ఉన్న వ్యత్యాసం మొత్తం బ్యాంకు ఖాతాల్లోకి జమకాకపోవడం, దీనిపై ఎవరిని అడగాలో కూడా తెలియకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కొంతవరకు ఊరట కలిగించింది. -
ఇక పెట్రోలు బంకుల్లో గ్యాస్ సిలిండర్లు!!
గ్యాస్ కనెక్షన్ ఇంకా రాని సమయంలో చిన్న సిలెండర్లు తీసుకుని, వాటిమీద వంట చేసుకోడం సర్వసాధారణమే. కానీ వాటిని అనధికారికంగా బయట కొనుక్కోవడం, రీఫిల్ చేయించుకోవడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు. ఇప్పుడు తొలిసారిగా ఐదు కిలోల సిలిండర్లను పెట్రోలు బంకుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచాలని చమురు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ముందుగా మెట్రో నగరాల్లో దీన్ని అమలుచేస్తుంది. దీంతోపాటు.. ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ, కావాలంటే డీలర్లను మార్చుకోవడం లాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. చమురు కంపెనీలు స్వయంగా నిర్వహించే పెట్రోలు బంకుల్లో మాత్రమే ఈ ఐదుకిలోల సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటివి దేశం మొత్తమ్మీద కేవలం 47 వేల బంకులే ఉన్నాయి. అయితే.. వీటి ధర మాత్రం సబ్సిడీ ధర కంటే దాదాపు రెట్టింపు ఉండే మార్కెట్ రేటుకు మాత్రమే ఇస్తారు. ఈనెల ఐదో తేదీన బెంగళూరులో ఈ ఐదు కిలోల సిలిండర్లను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రారంభిస్తారు. ప్రాథమికంగా ఇవి కేవలం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితం. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కలిసి 1,440 బంకులను ఇందుకోసం ఎంచుకున్నాయి. ఒకచోట నుంచి మరోచోటుకు బదిలీలపై వెళ్లేవారు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇలాంటివాళ్లకు ఉద్యోగ సమయాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్లకు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం కుదరదు. అలాంటివాళ్లకు ఇది వరంగా ఉటుందని భావిస్తున్నారు.