
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ ధర పెంచిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'గృహావసరాలకు వాడే గ్యాస్ ధర ప్రభుత్వం పెంచలేదు. ఎల్‌పీజీ గ్యాస్‌పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం. అసలు ఎల్‌పీజీ గ్యాస్‌పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది. ఎల్‌పీజీపై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు.
కొన్ని మీడియా సంస్థలు అవగాహన లేక తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్‌పై ట్యాక్స్‌ను స్వల్పంగా పెంచింది. అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమే. వంట గ్యాస్‌పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదు' అని రజత్ భార్గవ్ స్పష్టం చేశారు. ('చంద్రబాబులా ఈ ప్రభుత్వం సీబీఐకి భయపడదు')
Comments
Please login to add a commentAdd a comment